సంఘ స్థాపకుల గేయం (Church Planters Song)


స్థాపకులం సంఘ స్థాపకులం


స్థాపకులం సంఘ స్థాపకులం (2)

క్రీస్తేసుని సైన్యపు వీరాధి వీరులం

పరలోక రాజ్యపు పనివారలం (2)

 

అ. ప. :      అదరము మేము బెదరము (2)

                ప్రభుయేసుని సంఘాలను స్థాపిస్తూ సాగెదం –

                 పరలోక రాజ్యాన్ని వ్యాపింప జేసేదం (2)

 

1. సువార్తను ప్రకటిస్తాం ప్రతిఒక్కరికీ         

     ప్రతిఒక్కరూ మనసుమారి విశ్వసించునట్లుగా  (2)   

     విశ్వసించినవారే రక్షింపబడునట్లుగా       (2)   

     రక్షణతో ప్రభురాజ్యం స్థాపించబడునట్లుగా (2)

 

2. శిష్యులుగా ఉండెదము ప్రభు యేసుకు       

    ప్రభుయేసుకు శిష్యులుగా తీర్చిదిద్దెదం   (2)    

    తీర్చిదిద్దబడిన వారు శిష్యులను చేయునట్లు (2)    

     శిష్యులను చేయుచూ కొనసాగునట్లుగా  (2) 

Comments

Popular posts from this blog

రైట్ సొసైటి థీమ్ సాంగ్ (Theme Song) – 2

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు (సేవకుని హృదయ రాగం)